Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?

Mamitha Baiju

Mamitha Baiju

మమితా బైజు చేతిలో మూడు సినిమాలు ఉన్నా, ఆమె టార్గెట్ మాత్రం తెలుగు సినిమానే. కానీ, చేతిలో ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. వరుస హిట్స్ కొడుతున్న ఈ టాలెంటెడ్ హీరోయిన్‌ని తెలుగు మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదో చూద్దాం. మలయాళ చిత్రం ‘ప్రేమలు’ డబ్బింగ్‌తో తెలుగు ఆడియన్స్‌కు మమిత బాగా దగ్గరైంది. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్‌కు ఫిదా అయిపోయాడు. ఈ ఏడాది నాలుగు సినిమాలతో వస్తే, రెండు హిట్ అయ్యాయి.

తమిళంలో నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, మలయాళంలో చేసిన ‘బెత్లహాం కుటుంబ యూనిట్’ సూపర్ హిట్ అయినా, తెలుగు దర్శక నిర్మాతల దృష్టి ఈ అమ్మడిపై పడడం లేదు. మమిత స్టార్స్ పక్కన సెట్ అవుతుందా అన్న డౌట్‌తో ఉన్నారు తెలుగు దర్శకులు. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ రాసుకుంటే ముందు ఆప్షన్ ఈ అమ్మడే. ఎందుకంటే, ఆల్రెడీ నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘బెత్లహాం కుటుంబ యూనిట్’ ఇలాంటి కథలతో రూపొందినవే. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్య, మమిత మధ్య 20 ఏళ్ల గ్యాప్ ఉంది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘బెత్లహాం కుటుంబ యూనిట్’ కూడా ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీనే, హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ మధ్య 12 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది. మమితా బైజు తమిళ, మలయాళ సినిమాలు తెలుగులో హిట్ అయినా, ఇక్కడ మాత్రం ఆఫర్స్ రావడం లేదు. మలయాళంలో ఛాన్స్ వచ్చినా, అక్కడ రెమ్యునరేషన్ కోటి లోపే ఉంటుంది. తెలుగులో ఆఫర్ రావాలి గానీ, రెండు కోట్లకు పైగా డిమాండ్ చేయాలన్న ప్లాన్‌లో ఉన్నా.. ఆ ఛాన్సే రావడం లేదు అమ్మడికి.