Site icon NTV Telugu

Mamitha Baiju Offers: స్కైని తాకిన మమితా పాపులారిటీ.. కాల్షీట్స్ కోసం క్యూకడుతున్న ఫిల్మ్ మేకర్స్‌!

Mamitha Baiju New Films

Mamitha Baiju New Films

Mamitha Baiju’s popularity soars after Premalu: ‘ప్రేమలు’ లాంటి డబ్బింగ్ చిత్రంతో సౌత్ మొత్తం రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్న మలయాళ కుట్టీ ‘మమితా బైజు’. మాలీవుడ్‌లో 15 సినిమాలు చేసినా రాని లక్.. ప్రేమలుతో దక్కడంతో దాన్ని క్యాష్ చేసుకుని పనిలో బిజీ అయ్యారు. తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో.. పొరుగున ఉన్న కోలీవుడ్‌పై మమితా ఫోకస్ పెట్టారు. రెబల్ దెబ్బేసినా.. డ్యూడ్ హిట్‌తో అమ్మడి పాపులారిటీ స్కైని తాకింది. యూత్ అటెన్షన్ గ్రాబ్ చేయడంలో సక్సెస్ కావడంతో.. తమిళ్ ఫిల్మ్ మేకర్స్‌ మమితా కాల్షీట్స్ కోసం క్యూ కట్టారు.

ప్రేమలు తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించిందీ కానీ.. ఏకంగా స్టార్స్ హీరోలైన విజయ్ దళపతి, సూర్య, ధనుష్‌లతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు మమితా బైజు. విజయ్ జననాయగన్‌తో పాటు సూర్య విశ్వనాథ్‌ అండ్ సన్స్, ధనుష్ కరలో నటిస్తున్నారు. అదే సమయంలో సెలక్టివ్ సబ్జెక్ట్స్ చూజ్ చేసుకుంటూ.. మూవీ మూవీకి వేరియేషన్ చూపిస్తూ.. డిఫరెంట్ క్యారెక్టర్స్‌ ఎక్స్ ప్లోర్ చేస్తున్నారు.

Also Read: BCCI Revenue: ఆర్ఆర్, ఆర్‌సీబీల భారీ డీల్‌లు.. బీసీసీఐకి ఎన్ని కోట్ల లాభమో తెలుసా?

జన నాయగన్‌లో విజయ్ దళపతి కూతురిగా.. స్ట్రాంగ్ గర్ల్ రోల్ మమితా బైజు చేస్తున్నారు. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్‌లో పూర్తి కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. తన కన్నా 20 ఏళ్ల పెద్దయిన వ్యక్తి ప్రేమలో పడి, అతడి లవ్ కోసం పరితపించిపోయే నాటీగర్ల్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఇక ధనుష్ కరలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా, ఫక్తు డీ గ్లామర్ రోల్ చేయబోతున్నారు. విష్ణు విశాల్ ఇరుండు వానం ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతుంది. ఇలా డిఫరెంట్ షేడ్స్‌ను చూపిస్తూ.. ఏ పాత్రకైనా తాను ఫిట్ అవ్వగలనని మమితా ఫ్రూవ్ చేసుకుంటున్నారు.

Exit mobile version