Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంతో పాటు, మెల్బోర్న్లో జరగాల్సిన ఓనం వేడుకలను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మమితా బైజు మెల్బోర్న్లో నిర్వహించనున్న Clyde Onam 2026 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో మమితా పాల్గొనాల్సిన ఓనం వేడుకను కూడా నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం.
మమితా బైజు ప్రస్తుతం వైద్యుల సలహాలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే ఆమె నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సక్సెస్‌ను అందుకున్నారు. మమితా ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమెకు ఎదురైన అనారోగ్య సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్పత్రిలో ఎంతకాలం ఉండాల్సి వస్తుందనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు మాత్రమే తెలుస్తోంది. మమితా త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆస్ట్రేలియాలో వాయిదా పడిన ఓనం వేడుకకు సంబంధించిన కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
తాజావార్తలు
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!