96తో గుండెల్ని హత్తుకుపోయే లవ్ స్టోరీని అందించిన ప్రేమ్ కుమార్ .. ఆ తర్వాత కుటుంబ బంధాల గురించి తెలియజేస్తూ తెరకెక్కించిన సత్యం సుందరం కూడా సూపర్ హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ మూవీ డిసెంట్ హిట్ అందుకోవడమే కాదు సింపుల్ స్టోరీతో కథ నడిపించిన తీరును అప్లాజ్ చేయకుండా ఉండలేకపోయింది సౌత్ ఇండస్ట్రీ. వీటి తర్వాత 96 సీక్వెల్ తీయాలని ప్లాన్ చేయగా ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు మరింత సమయం పట్టడంతో చియాన్‌తో నెక్ట్స్ మూవీ ప్లాన్ చేశాడు. చియాన్ విక్రమ్ తో సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే, ఆ కథ పూర్తి చేయడానికి ఇంకా నాలుగు నెలలు పడుతుందట.
Also Read : Tollywood : మిరాయ్.. కిష్కింధపురి.. ప్రీమియర్స్ పై భయపడుతున్నారా?
అయితే ఈ లోపు మరొక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఈ ఫీల్ గుడ్ సినిమాల డైరెక్టర్. అందుకోసం మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ను హీరోగా ఎంచుకున్నాడు. ఇటీవల ఫహద్ ను కలిసి ఓ కథ కూడా వినిపించాడట. ప్రేమ్ చెప్పిన పాయింట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట ఫహద్. అలాగే ఫహద్ తో చేసే సినిమా తన జానర్ అయినటువంటి ఫీల్ గుడ్ ఎమోషన్ కాదని ఈ సారి యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ లో సినిమా చేయబోతున్నాను. నాకు చాలా మంది ఇప్పుడు యాక్షన్ జానర్ వద్దు అని చెప్పారు. కానీ నేను యాక్షన్ సినిమా చేసి జానర్ ను బ్రేక్ చేయాలనీ చుస్తున్నాను, ఫహద్ తో అనుకున్న సినిమాకు సంబందించిన కథ 4 ఇయర్స్ గా నా మనసులో ఉంది అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సి ప్రేమ్ కుమార్;.
