Site icon NTV Telugu

Aavesham : ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2024 05 03 At 2.20.30 Pm

Whatsapp Image 2024 05 03 At 2.20.30 Pm

సినిమాలో కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఇతర భాషల చిత్రాలను కూడా ఎంతగానో ఆదరిస్తారు. ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.దీనికి కారణం ఆ సినిమాల కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుంది.కేవలం థియేటర్స్ లోనే కాకుండా మలయాళ సినిమాలు ఓటిటీలో కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తాజాగా మరో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధంగా వుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ మూవీ ఓటిటిలోకి రానుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తెలుగులో తెరకెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు..

పుష్ప మూవీ లో విలన్ పాత్రలో నటించిన ఫహద్ ప్రతి ఒక్కరిని ఎంతగానో మెప్పించారు..ఇదిలా ఉంటే ఫహద్ మలయాళంలో లేటెస్ట్ గా నటించిన సినిమా “ఆవేశం”. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా సుమారు రూ.130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అదరగొట్టింది. ప్రస్తుతం థియేటర్ లో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది . ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 9 నుంచే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలోకి స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం .అయితే ‘ఆవేశం’ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్ రిలీజ్ ఉంటుందో లేదో క్లారిటీ లేదు.అయితే ఓటీటీ లో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Exit mobile version