ఒరు ఆధార్ లవ్‌తో మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ భామ.. మొదటి సినిమాతోనే యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తన మూవీ సెలెక్షన్లో తడబడ్డ ప్రియ క్రేజ్ క్రమంగా తగ్గిపోయింది. టాలీవుడ్, మాలీవుడ్‌లో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో ఆఫర్లు తగ్గిపోయాయి. తెలుగులో చెక్, ఇష్క్, బ్రో చేసింది కానీ వాటిలో ఒక్కటి కూడా హిట్ అవలేదు. ప్రియా ప్రకాష్‌వారియర్ టాలీవుడ్, మాలీవుడ్ కలిసి రావట్లేదని బాలీవుడ్లో ప్రయత్నాలు చేసింది. అయినా అక్కడ కూడా కలిసి రాలేదు.
Also Read : JR NTR : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్
ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ సేమ్ సిచ్యుచేషన్. దాంతో మరోసారి తమిళ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ధనుష్ డైరెక్షన్ లో నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబంలో నటించి మెప్పించింది ఈ కేరళ కుట్టీ. ఇక ఆ తర్వాత కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీలో అర్జున్ దాస్‌కు జోడీగా కనిపించి ఆకట్టుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీలో స్పెషల్ రోల్ చేసి బాగా ఎంటర్ టైన్ చేసింది. ముఖ్యంగా అర్జున్ దాస్- ప్రియా మధ్య రొమాంటిక్ డ్యాన్స్ బిట్ కు ఫిదా అయ్యారు ఆడియన్స్. మొత్తానికి చాలా రోజుల తర్వాత రెండు హిట్స్ కొట్టేసిన ఈ బ్యూటీకి బాలీవుడ్ పిలిచి అవకాశం ఇచ్చింది. ప్రజెంట్ ఈ బ్యూటీ చేతిలో త్రీ మంకీస్, లవ్ హ్యాకర్స్ వంటి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ రెండు మూవీస్‌లో ఏది హిట్ కొట్టినా ప్రియా బాలీవుడ్లో సెటిల్ అవడం ఖాయం.