“ఎస్ఎస్ఎంబి28” హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కథ, హీరో పాత్ర, హీరోయిన్ పాత్రకు సంబంధించిన పలు పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ రేసులో పూజాహెగ్డే, జాన్వీ కపూర్, దిశా పటానిల పేర్లు విన్పించాయి. తాజాగా ఈ జాబితాలో తమిళ హాట్ భామ పేరు తెరపైకి వచ్చింది. విజయ్ “మాస్టర్”లో నటించిన మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్ తో మేకర్స్ చర్చలు జరుపుతున్నారనేది తాజా సమాచారం. త్రివిక్రమ్ ఈ కథను త్వరలోనే ఈ యువ నటికి వివరిస్తారని, ఆ తరువాత నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్తలు గనుక నిజమైతే భారీ అంచనాలతో తెరకెక్కనున్న “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” చిత్రం మాళవికకు తెలుగులో మొదటి చిత్రం అవుతుంది. మొదటి చిత్రంలోనే మహేష్ తో కలిసి నటించే అవకాశం మాళవికను వరిస్తుందో లేదో చూడాలి. మహేష్ బాబు “సర్కారు వారి పాట”ను పూర్తి చేసిన వెంటనే “ఎస్ఎస్ఎంబి 28” షూటింగ్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నాడు.
Also Read
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!