Site icon NTV Telugu

Malaika: బ్రేకప్ తర్వాత మలైకా అరోరా కొత్త రిలేషన్ షిప్? 17 ఏళ్ల చిన్నోడితో డేటింగ్

Malaika

Malaika

బాలీవుడ్ సీనియర్ బ్యూటీ, ఫిట్‌నెస్ ఐకాన్ మలైకా అరోరా తన వ్యక్తిగత జీవితంతో మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో మరియు బి-టౌన్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మలైకా ప్రస్తుతం తనకంటే వయసులో చాలా చిన్నవాడైన ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక సెన్సేషనే. మొదట నటుడు అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న మలైకా, ఆ తర్వాత చాలా కాలం పాటు నటుడు అర్జున్ కపూర్తో రిలేషన్ షిప్‌లో ఉన్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరూ భావించిన తరుణంలో, ఊహించని విధంగా అర్జున్ కపూర్‌తో ఆమె బ్రేకప్ చేసుకున్నారు.

Also Read:Dhurandhar: పాక్‌లో “ధురంధర్” బ్యాన్.. కానీ, వైరల్ సాంగ్‌తో చిన్న భుట్టో ఎంట్రీ..

ఇటీవల ఒక ఈవెంట్‌లో అర్జున్ తాను ‘సింగిల్’ అని ప్రకటించడంతో వీరి విడిపోవడం అధికారికమైంది. తాజా సమాచారం ప్రకారం, మలైకా అరోరా ప్రస్తుతం హర్షా మెహతా అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హర్షా మెహతా మలైకా కంటే 17 ఏళ్లు చిన్నవాడని సమాచారం. అర్జున్ కపూర్ కూడా మలైకా కంటే వయసులో చిన్నవారే అయినప్పటికీ, ఇప్పుడు ఈ కొత్త వ్యక్తితో ఆమె అనుబంధం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read:Nidhi Agarwal: నిధి అగర్వాల్’తో అసభ్య ప్రవర్తన.. వారిపై కేసు నమోదు?

ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మలైకా తన వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా జీవించే ధైర్యవంతురాలని కొందరు ఆమెను సమర్థిస్తుంటే, మరికొందరు ఆమె వరుస బ్రేకప్‌లు, వయసు తేడాపై విమర్శలు చేస్తున్నారు. అయితే, ఈ వార్తలపై మలైకా అరోరా కానీ, హర్షా మెహతా కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. వారు కేవలం స్నేహితులా లేక నిజంగానే ప్రేమలో ఉన్నారా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా, మలైకా తన బోల్డ్ నిర్ణయాలతో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు.

Exit mobile version