Releases Postpone : ముగ్గురు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ పోస్ట్‌పోన్ కాబోతున్నాయి

Om, Arasan, Suriya 47

Om, Arasan, Suriya 47

కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్న పలు క్రేజీ ప్రాజెక్ట్‌ల విడుదల తేదీలలో మార్పులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దసరా, దివాళి, క్రిస్మస్ మరియు పొంగల్ రేసులో నిలవాల్సిన పలు పెద్ద చిత్రాలు అనుకున్న సమయానికి కాకుండా వాయిదా పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ధనుష్ హీరోగా, రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం OM . మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా అక్టోబర్ రేస్ నుంచి తప్పుకుని నవంబర్‌లో రాబోయే దివాళి సీజన్‌కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. జైలర్ 2 కారణంగా పోస్ట్ పోన్ అవుతున్నట్టు సమాచారం. ఇక స్టార్ హీరో సూర్య, ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం సూర్య 47. ఈ చిత్రాన్ని ప్రారంభంలో దివాళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ మేకింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డిసెంబర్ క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సిలంబరసన్ టీఆర్ శింబు దర్శకుడు వెట్రిమారన్ కలయికలో వస్తున్న భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా అరసన్. ముందుగా ఈ సినిమాను కూడా దివాళి బరిలో నిలపాలని భావించినప్పటికీ  తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుంది. ‘అరసన్’ చిత్రాన్ని 2027 సంక్రాంతి  రేసులో భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా కోలీవుడ్ లో ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు పోస్ట్ పోన్ కాబోతున్నాయి.