Releases Postpone : ముగ్గురు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ పోస్ట్‌పోన్ కాబోతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్న పలు క్రేజీ ప్రాజెక్ట్‌ల విడుదల తేదీలలో మార్పులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దసరా, దివాళి, క్రిస్మస్ మరియు పొంగల్ రేసులో నిలవాల్సిన పలు పెద్ద చిత్రాలు అనుకున్న సమయానికి కాకుండా వాయిదా పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ధనుష్ హీరోగా, రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘OM‘ . మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా అక్టోబర్ రేస్ నుంచి తప్పుకుని నవంబర్‌లో రాబోయే దివాళి సీజన్‌కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. జైలర్ 2 కారణంగా పోస్ట్ పోన్ అవుతున్నట్టు సమాచారం. ఇక స్టార్ హీరో సూర్య, ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘సూర్య 47‘. ఈ చిత్రాన్ని ప్రారంభంలో దివాళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ మేకింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డిసెంబర్ క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సిలంబరసన్ టీఆర్ శింబు దర్శకుడు వెట్రిమారన్ కలయికలో వస్తున్న భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘అరసన్‘. ముందుగా ఈ సినిమాను కూడా దివాళి బరిలో నిలపాలని భావించినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుంది. ‘అరసన్’ చిత్రాన్ని 2027 సంక్రాంతి రేసులో భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా కోలీవుడ్ లో ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు పోస్ట్ పోన్ కాబోతున్నాయి.
Also Read
- Mrunal Thakur: డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం.. వెంటనే తొలగించండి, లేదంటే చట్టపరమైన చర్యలే!
- October Movies : దసరాపై కర్చీఫ్ వేసిన మెగాస్టార్.. సూపర్‌స్టార్.. సోలోగా వస్తున్న వెంకీ మామ
- Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
- Ravi Teja : సెంటిమెంట్స్‌ను పట్టించుకోని రవితేజ.. చైల్డ్ సెంటిమెంట్ హిట్ తీసుకొస్తుందా?
తాజావార్తలు
-
Releases Postpone : ముగ్గురు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ పోస్ట్‌పోన్ కాబోతున్నాయి
-
Balochistan: ముక్కలైన పాకిస్థాన్? స్వాతంత్ర్యం ప్రకటించుకున్న బలూచిస్థాన్.. 11 భాషల్లో లౌకిక రాజ్యాంగం!
-
PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
-
iQOO నుంచి మరో బీస్ట్ ఫోన్.. 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్‌తో వచ్చేస్తున్న Neo 11S.!
-
Virat Kohli: కోహ్లీకి కోపం వస్తుంది.. క్రికెట్ బోరింగ్‌గా మారిపోతుంది.. మాజీ అంపైర్ అనిల్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!