NTV Telugu Site icon

Puri Jagannadh: ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టర్ తో మహేష్ సినిమా చేయడు: పూరి జగన్నాథ్

February 7 2025 02 23t085801.724

February 7 2025 02 23t085801.724

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పరిచయం అక్కర్లేదు.తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోలను, స్టార్ కిడ్స్ పరిచయం చేయలన.. అప్పటికే సెటిల్ అయిన హీరోలకు మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టాలన్నా పూరీ తర్వాతనే ఎవ్వరైన. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్, బన్నీ, రెబల్ స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి టాలీవుడ్ స్టార్ అందరితో పని చేసిన పూరి జగన్నాధ్ వారి కెరీర్‌ని మలుపు తిప్పాడు. పూరి తో జత కట్టిన తర్వాత ఈ హీరోల ఇమేజ్ మరింత పెరిగిపోయింది. కానీ ఇప్పుడు పూరి గొరమైన స్థితిలో ఉన్నాడు.

Also Read: Taapsee: ఫైర్‌బ్రాండ్ కంగనా సిస్టర్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తాప్సీ

వరుస ఫ్లాప్ లతో చితికిన పడిపోయాడు. ప్రజంట్ కథలు సిద్ధంగా ఉన్న హీరోలు డేట్ లు ఇవ్వడంలేదట. అయితే పూరి ఇంకా మహేష్ బాబు కాంబినేషన్‌కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. దీంతో వీరి కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరి.. మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

మీరు మహేష్ తో సినిమా చేస్తే చూడాలి అని ఉంది అని యాంకర్ అడగటంతో.. ‘ మీరు చెబితే నమ్మరు కానీ మహేశ్ నాతో హిట్ పడితే సినిమాలు చేస్తారు. సక్సెస్ లో ఉంటేనే ఓకే చెప్తారు. కానీ నేను ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు కూడా మహేశ్ బాబు అభిమానులు మహేష్ అన్నతో సినిమా ఎప్పుడన్నా? అని అడుగుతున్నారు. మహేశ్ మాత్రం నేను సక్సెస్ లో ఉంటేనే నాతో సినిమా చేస్తాడు. ఆయన కంటే ఆయన అభిమానుల పైనే నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. కనీసం వాళ్ళు నన్ను ఎంతగానో నమ్ముకున్నందుకు.. మహేశ్‌కు నాపై నమ్మకం లేకపోవడంతో కాంబో సెట్ అవ్వడం లేదు’ అని చెప్పుకొచ్చాడు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.