NTV Telugu Site icon

Mahesh – Rajamouli: కాస్కోండ్రా అబ్బాయిలూ.. ఇక డైరెక్ట్ ఎటాక్!

Mahesh,rajamouli

Mahesh,rajamouli

Mahesh – Rajamouli film Regular Shoot to Commence in Germany: గుంటూరు కారం సినిమాతో ఓ మాదిరి రిజల్ట్ అందుకున్న మహేష్ బాబు తన తదుపరి సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన అధికారికి ప్రకటన లేదు. కానీ మహేష్ బాబు చేయబోతున్న సినిమా మాత్రం రాజమౌళిదే అని దాదాపు టాలీవుడ్ అంతా క్లారిటీగా ఉంది. మహేష్ బాబు కెరియర్లో 29వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించబోతున్నారు. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మక చిత్రంగా ఈ సినిమాని తరికెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే కొన్ని లీక్స్ వచ్చాయి గాని దేనిని నమ్మలేని పరిస్థితి. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఉంటుందని అందరూ భావించారు.

Sundeep Kishan: తమిళ సినిమాలా.. ఇక చాలు బాబోయ్!

అంతేకాదు ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి సినిమా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా అనుకున్నారు. కానీ సినిమా యూనిట్ మాత్రం ముందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు నాడు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదట. అయితే మరికొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ మాత్రం విదేశాలలో ప్లాన్ చేయబోతున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న దాని మేరకు ఈ సినిమా షూటింగ్ జర్మనీలో మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి గతంలో ఈ సినిమా కోసం మహేష్ బాబు కొన్నిసార్లు జెర్మనీ వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో జర్మనీలో షూటింగ్ జరగబోతోంది అంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది షూటింగ్ ప్రారంభమైతే కానీ క్లారిటీ రాకపోవచ్చు.

Show comments