టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఆనంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా థియేటర్లలోను అలరిస్తోంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. గ్రామీణ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో లైటింగ్ సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు ఆకట్టుకొన్నాడు. అయితే తాజాగా సూపర్ మహేష్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాను చూశారు. దీనికి సంబందించిన ఫోటోను సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ గోవా షెడ్యూల్ షూటింగ్ ను పూర్తిచేసుకొంది. కీర్తి సురేష్ కథానాయిక.. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
‘శ్రీదేవి సోడా సెంటర్’ వీక్షిస్తున్న మహేష్ బాబు
