మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రాలో ‘ఖలేజా’ ఒకటి. యాక్షన్, కామెడీ, ఫాంటసీ కలబోసిన ఈ వినూత్న ప్రయోగాత్మక చిత్రం 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటిరి.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మారింది. అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో నిర్మాతకు చాలా నష్టం వాటిల్లింది. అయినప్పటకి మహేష్ బాబును ఇదివరకు ఎన్నడూ చూడని కామెడీ యాంగిల్‌లో డైరెక్టర్ త్రివిక్రమ్ చూపించారు. సినిమాలోని మహేష్ ప్రతి ఒక్క డైలాగ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. దీంతో ఈ సినిమా రీ రిలీజ్‌కు సిద్థం అయ్యింది..
Also Read : Prabhas: ‘ది రాజా సాబ్’ టీజర్‌పై క్లారిటీ ఇచ్చిన ఎస్‌కేఎన్..!
మొత్తనికి 4K వెర్షన్‌లో ప్రపంచవ్యాప్తంగా మూవీని ఈ నెల 30న రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తి అంత ఇంతా కాదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు బుక్ మై షో లో గంటకు ఏకంగా 14 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతుండటం, ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని బట్టి ఈ సినిమాపై ఎలాంటి బజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే రీరిలిజ్ అయిన మహేష్ బాబు ‘పోకిరి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ‘ఖలేజా’ సినిమా సైతం అంతే స్థాయిలో హిట్ అవుతుందని టీం భావిస్తోంది.
