భారతీయ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలపై వివిధ భాషల్లో వందల చిత్రాలు తెరకెక్కాయి. ముఖ్యంగా మహాభారతం కథ, ఇందులో పాత్రలు ఆసక్తిగొలిపే విధంగా ఉంటాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డ్రీం ప్రాజెక్ట్ మహాభారతమట. హనుమాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమయంలో మహాభారతం తాను తెరకెక్కిస్తే ఏ పాత్రకు ఏ హీరోని ఎంచుకుంటాడో వివరించాడు. ప్రశాంత్ వర్మ మహాభారతంలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబును ఎంపిక చేశారు. ఇక అర్జునుడు పాత్రకు రామ్ చరణ్ ని ఎంచుకున్నారు. భీముడు పాత్రకు ఎన్టీఆర్ అన్నారు. ఇక అలా మహేష్ ను కృష్ణుడిగా ఫిక్స్ అయిన ఆయన ఇప్పుడు నిజంగానే మహేష్ ను కృష్ణుడిగా చూపించనున్నట్లు తెలుస్తోంది.
Ka Movie: కొత్తదనం ఫీల్ కాకుంటే సినిమాలు చేయను.. ఇప్పటికే అదేమాట మీదున్నా: కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూ
అసలు విషయం ఏమిటంటే ‘హీరో’తో తెలుగు తెరకు పరిచయమైన మహేష్ మేనల్లుడు, హీరో అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న సరికొత్త మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దీనికి కథ అందించగా అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేశారు. నవంబర్ 14న ఇది విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మహేశ్‌బాబు అతిథి పాత్రలో కనిపించనున్నారని, క్లైమాక్స్‌లో శ్రీ కృష్ణుడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని కృష్ణుడిగా మహేశ్ నటిస్తే బాగుంటుందని యూనిట్ భావించిందని తెలుస్తోంది. ఈ మేరకు చిత్రబృందం మహేశ్‌ను ఒప్పించి షూట్ చేశారని టాక్ నడుస్తుండగా లేదు ఆయనను గ్రాఫిక్స్ లో చూపిస్తారని మరో టాక్ నడుస్తోంది. ఈ సినిమాను సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక నిజానికి మహేశ్‌బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. జనవరి నుంచి ఈ సినిమా షూట్ మొదలు కానున్నట్టు తెలుస్తోంది.