సినీ ప్రపంచంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో ఆయన పిల్లలకు కూడా అంత క్రేజ్ ఉంది. మహేష్ సతీమణి నమ్రత తరచుగా వారి ఫ్యామిలీ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు నమ్రత. తమ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ళ లిస్ట్ లో స్థానాన్ని సంపాదించాడని నమ్రత వెల్లడించారు.
Also Read : “లైగర్” కోసం లెజెండరీ ప్రొఫెషనల్ బాక్సర్ ?
15 ఏళ్ల గౌతమ్… ఆయుష్ యాదవ్ అనే శిక్షకుడి దగ్గర ఈతలో శిక్షణ పొందుతున్నాడు. ఆయుష్ యాదవ్ ఒక ప్రొఫెషనల్ ఈతగాడు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణతో కలిసి రాష్ట్ర కోచ్ గా పని చేస్తున్నాడు. తన కొడుకు సాధించిన విజయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో గర్వంగా పంచుకున్నారు నమ్రత. బటర్‌ఫ్లై, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్ & ఫ్రీస్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో గౌతమ్ ఈత కొడతాడని, అతనికి ఫ్రీస్టైల్ అంటే బాగా ఇష్టమని, నీళ్లలో 5 కి.మీ 3 గంటల్లో ఈదగలడని నమ్రత చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన సూపర్ స్టార్ అభిమానులు గౌతమ్ కు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. కాగా గౌతమ్ ఘట్టమనేని “1 నేనొక్కడినే”లో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
