NTV Telugu Site icon

Mahesh babu : మహేశ్ సినిమాల రీరిలిజ్ క్రేజ్ మామూలుగా లేదుగా..

Untitled Design (37)

Untitled Design (37)

సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9.ఈ సందర్భంగా మహేశ్ అభిమానులు తమ హీరో బర్త్ డేను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో రక్తదాన శిబిరం వంటివి నిర్వహించబోతున్నారు. జిల్లాల వారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పుట్టిన రోజు మహేశ్ కు చాలా స్పెషల్. ఈ ఏడాదిలోనే రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించబోతున్నాడు. దీంతో మహేశ్ బాబు గ్లోబల్ స్టార్ గా మారబోతున్నాడు.

మరోవైపు ఘట్టమనేని అభిమానులు మహేశ్ సూపర్ హిట్ సినిమాలను వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ చేయబోతున్నారు. మహేశ్ తోలి నాళ్లలో నటించిన మురారి, ఒక్కడు చిత్రాలను 4K క్వాలిటీతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.  ముఖ్యంగా నైజాంలో మహేశ్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. ఒక్కడు చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక మహేశ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ బొమ్మ మురారి వారం రోజులు పాటు ప్రదర్శిస్తున్నారు. కాగా ప్రముఖ సినిమా టికెట్స్ బుకింగ్ యాప్ అయిన బుక్ మై షోలో టికెట్స్ సేల్ కు ఉంచగా కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో అల్ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. గడిచిన 1 గంటలో 1.50K టికెట్స్ బుక్ అయ్యి రికార్డు సృస్టించింది మురారి. మరీ ముఖ్యంగా మహేశ్ బాబు అడ్డాగా భావించే సుదర్శన్ 35MMలో ఆగస్టు 9నాడు ఒక్క టికెట్ కూడా మిగలలేదంటే మహేశ్ క్రేజ్, ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉందొ అర్ధం అవుతుంది.

Show comments