సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమాపై ఫ్యాన్స్‌కి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకూ మహేశ్ ను ఎప్పుడూ చూడని కొత్త లుక్‌లో చూపించబోతున్నారని యూనిట్ వర్గాల సమాచారం. మహేష్ కెరీర్‌లోనే ఇది గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.
Also Read : Bhogi : భోగి కోసం శర్వానంద్ రెడీ.. మళ్లీ సెట్స్‌లోకి ఎంట్రీ!
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఫోక్ సాంగ్ ప్లాన్ చేసారట. మ్యాజిక్ మ్యూజిషియన్ ఎం.ఎం. కీరవాణి దీనికి మాస్ బీట్ ఇస్తుండగా, టాప్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ పాటకు స్టెప్స్ వేశారట. మరి ఈ పాటలో మహేష్ బాబుతో పాటు హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా స్క్రీన్ షేర్ చేయబోతున్నది. మహేష్ – ప్రియాంక కాంబోలో ఎప్పుడూ చూడని ఎనర్జిటిక్ స్టెప్స్ ఉండబోతున్నాయని టాక్. ఈ స్పెషల్ సాంగ్ స్క్రీన్‌పై పడితే థియేటర్స్‌లో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వేరే లెవెల్‌లో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్‌తో ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్‌లో మూవీ నుంచి మరిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయట. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే, మహేష్ డ్యాన్స్ మంత్రం రాజమౌళి విజన్ కీరవాణి బీట్స్ అంటే ఊహించుకోండి.. సోషల్ మీడియాలో ఇప్పటికే ‘మాస్టర్‌పీస్ లోడింగ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి ఈ ఫోక్ సాంగ్ కోసం కౌంట్‌డౌన్ మొదలైందని చెప్పొచ్చు.
