బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి తన మార్క్ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ఈ నెల 20న విడుదలై మంచి పాజిటివ్ రెస్పాండ్ అందుకుంటుంది. ప్రముఖ చిత్రం ‘తారే జమీన్ పర్’ కి ఒక రకంగా సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం, మానసికంగా వెనుకబడ్డ పిల్లల నేపథ్యంలో ఓ హృద్యమైన సందేశాన్ని వినోదంతో కలిపి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో జెనీలియా, అరౌష్ దత్త, గోపి కృష్ణన్ వర్మ, నమన్ మిశ్రా, వేదాంత శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాపై తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ట్విట్టర్ (X) లో స్పందించిన మహేశ్..
Also Read : Mani Ratnam : అభిమానులకు క్షమాపణలు చెప్పిన మణిరత్నం..
‘మూవీ అద్భుతం. అమీర్ ఖాన్ ఇతర క్లాసిక్ మూవీస్ లాగానే ‘సితారే జమీన్ పర్’ కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టేలా చేస్తుంది. మూవీ చూసాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు’ ట్వీట్ చేశారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు ప్రేక్షకుల కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తడంతో పాటు ముఖ్యంగా మహేశ్ బాబు లాంటి స్టార్ స్పందించడం ఈ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రజంట్ ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
