NTV Telugu Site icon

Mahesh Babu : నయనతార వివాదం.. ఆసక్తి రేపుతున్న మహేష్ ఇన్‌స్టా పోస్ట్

Nayanthara

Nayanthara

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ కోలీవుడ్ లో వివాదానికి దారి తీసింది. ఈ డాక్యుమెంటరీ కారణంగానే ఇన్ని రోజులు నివురుగప్పిన నిప్పులా ఉన్న నయనతార, ధనుష్ ల కోల్డ్ వార్ ఒక్కసారిగా బరస్ట్ అయింది. డాక్యుమెంటరీ లో తాను నిర్మించిన సినిమాలోని మూడు సెకండ్ల వీడియో క్లిప్ వాడుకున్నందుకు ధనుష్ రూ. 10 కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేయడంతో నయనతార ఆగ్రహంతో ఊగిపోయింది. ధనుష్‌పై పలు ఆరోపణలు గుప్పిస్తూ, నువ్వు ఎలాతని వాడివో తెలిసింది అని తీవ్ర పదజాలంతో నయనతార నవంబర్ 16న ఎక్స్ లో చేసిన పోస్ట్ కోలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read : Baaghi4 : బాబోయ్ టైగర్ ష్రాఫ్.. సీక్వెల్స్ తో చంపేలా ఉన్నాడు

కాగా ఈ నెల 18న ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. కానీ అందులో నయన్ , ధనుష్ మధ్య వివాదానికి కారణమైన యదావిధిగా ఉంచింది. ఇప్పడూ ఈ వ్యవహారంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన ఇన్ స్టా పోస్ట్ మరింత ఆసక్తి కరంగా మారింది. నయన్ ఫ్యామిలీ ఫోటో ను ఇన్ స్టా స్టోరీ గా పెడుతూ లవ్ సింబల్ జత చేస్తూ షేర్ చేసారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ధనుష్ తో నయనతార వ్యవహారనికి సంబంధించి ఒక స్టార్ హీరో పై ధైర్యంగా మాట్లాదావ్ లేదా ఎన్నో అవమానాలు ఎదుర్కొని నేడు లేడీ సూపర్ స్టార్ రేంజ్ కు చేరుకున్నావ్ అని అభినందిస్తూ ఈ పోస్ట్ చేసారా అనేది ఆసక్తికరంగా మారింది.

Show comments