Site icon NTV Telugu

Mahesh Babu: మరో సూపర్ హిట్ యాడ్ చేసిన మహేశ్ బాబు.. సితార

Untitled Design 2025 03 21t101903.025

Untitled Design 2025 03 21t101903.025

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకే కాదు.. సోషల్ మీడియాలో ఆయన ముద్దుల కూతురు సితారకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె తన వీడియోలతో పాటు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలా సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్‌ ఉన్నారు. అలాగే సితార ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇంత చిన్న ఏజ్‌లోనే అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్పై సంతకం చేసిన మొదటి భారతీయ స్టార్ట్ కిడ్‌గా నిలిచింది. అలా తన డ్యాన్స్‌, ఇతర యాక్టివిటీస్‌తో అందరినీ ఆకర్షిస్తున్న సితార , డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా నిర్వహిస్తోంది. ఇక కెరీర్ లో ముందుకు సాగుతూ తండ్రి తగ్గ తనయ అనిపించుకుంటోంది. అయితే తాజాగా సితార, మహేష్ బాబుకి సంబంధించిన యాడ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

also Read: Yellamma : చివరి నిమిషంలో సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా..!

ప్రముఖ క్లాత్ షోరూం యాడ్ లో తండ్రి కూతులు అదరగొట్టారు. ఇందులో మహేష్ చాలా అంటే చాలా హ్యాండ్ సమ్‌గా ఉన్నాడు. చెప్పాలి అంటే పాతికేళ్ళ కుర్రాడిలా ఉన్నాడు. దీంతో ‘అందరికీ ఏజ్ పెరుగుతుంటే నీకు తగ్గుతుందేంటయ్యా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.ఇంతకు ముందు కూడా బుల్లితెర పై సీరియల్స్ ప్రమోషన్‌లో ఇలాగే ఇద్దరు ఎంతో ఆకట్టుకున్నారు. తెలుగు కుటుంబ ప్రేక్షకులకు తన కూతురు దగ్గరవుతుంది అనే ఉద్దేశంతో మహేష్ ఆ ప్రచారం చేశాడట. ప్రజంట్ క్లాత్ షోరూం యాడ్ మాత్రం సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది.

Exit mobile version