మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ చూస్తుంటే, పసుపు రంగు చీర ధరించిన ప్రియాంక చోప్రా గన్‌తో ఫైరింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
Also Read:Kajol : పెళ్లికి ఎక్స్ పైరీ డేట్ కావాలంట.. ఈ హీరోయిన్ కు ఏమైంది..
ఎక్కడో పర్వత శ్రేణులలో నిలబడి ఆమె ఈ ఫైరింగ్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉండడంతో పాటు, ఈ సినిమాకి వాడుతున్న ‘గ్లోబ్ ట్రాటర్’ పదం ఇప్పుడు సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించడానికి సిద్ధమైన సినిమా టీమ్, హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీల్ ఈవెంట్‌ను నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.
Also Read:Fastag New Rule: నవంబర్ 15 నుంచి మారబోతోన్న ఈ టోల్ రూల్.. ఈ తప్పు చేస్తే భారీ నష్టం!
అయితే, భద్రతా కారణాల వల్ల ఈవెంట్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ, రాజమౌళి మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నట్టుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక తాజాగా రిలీజైన లుక్ అయితే ఆసక్తికరంగా ఉంది. ఇప్పటివరకు ఆమె ఫారిన్ కంట్రీ అమ్మాయిగా చూపిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆమె అచ్చు తెలుగు అమ్మాయిలా చీరకట్టులో కనిపిస్తూ ఉండడంతో ఆమె పాత్రపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక “మందాకిని” అంటూ వచ్చేసిన ప్రియాంక చోప్రాను మీరు కూడా చూసేయండి.
