Site icon NTV Telugu

Mahavatar Narsimha: దేవుడి సినిమాని గుండెల్లో పెట్టేసుకున్నారు.. 300 కోట్ల ఉగ్ర తాండవం

Mahavatar Narasimha

Mahavatar Narasimha

అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహావతార్ నరసింహ’ సినిమా ఎన్నో సంచలన రికార్డులను బద్దలు కొడుతూ దూసుకు వెళుతోంది. అత్యంత తక్కువ బడ్జెట్‌లో డైరెక్టర్ అశ్విన్ కుమార్ సారధ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఆయన భార్య నిర్మాతగా మారి, ఈ సినిమాకి ఇద్దరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అవుట్‌పుట్ చూసిన హోంబాలే ఫిల్మ్స్ సంస్థ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ తమ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో రిలీజ్ చేసింది.

Also Read:Ghaati : అనుష్కకు ఏమైంది.. ఎందుకు ఇలా చేస్తోంది..?

ఇక, ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు దూసుకొచ్చిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది. ఈ సినిమా శనివారం రోజు, అంటే నిన్న, ఏకంగా ఇండియా మొత్తం మీద ఆరు కోట్ల కలెక్షన్లను రాబట్టింది. సినిమా రిలీజ్ అయిన 30వ రోజు, అది కూడా ‘కూలీ’, ‘వార్ 2’ లాంటి సినిమాల పోటీని తట్టుకుని ఆ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటికే 259 కోట్ల రూపాయల కలెక్షన్లను క్రాస్ చేసిన ఈ సినిమా, ఈ రోజుతో 300 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘మహావతార్ పరశురామ్’ సినిమాను రూపొందించేందుకు దర్శకుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.

Exit mobile version