Site icon NTV Telugu

Mahavatar : మరో భారీ ప్రాజెక్ట్‌ కు శ్రీకారం చుట్టిన హోంబలే ఫిల్మ్స్‌

Hombale

Hombale

కేజీయఫ్‌సినిమాతో ఒక్కసారిగా దూసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌. ‘కాంతార’, ‘సలార్’ సినిమాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా మారింది హోంబలే ఫిల్మ్స్‌. ఇటీవల టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజగా మరో సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది హోంబలే ఫిల్మ్స్‌. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘మహావతార్‌: నరసింహ’ అనే సినిమాను తాజాగా ప్రకటించింది. తాజగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాను కూడా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోంది హోంబలే .

Also Read : Mahesh Babu : సోలార్ బిజినెస్ లో మహేశ్ బాబు పెట్టుబడి..?

శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశాయ్‌, చైతన్య దేశాయ్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు.  మహావతార్‌ సిరీస్‌లో వస్తున్న సినిమాలో ఇది మొదటిది మాత్రమే అని,  దీనికి కొనసాగింపుగా ఇతర అవతారాలతో కూడా సినిమాలు రాబోతున్నాయని వెల్లడించారు. విశ్వాసం సవాలు చేయబడినప్పుడు, అతను కనిపిస్తాడు అనే ట్యాగ్ లైన్ తో ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసారు మేకర్స్.  నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. సామ్‌ సీఎస్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సామ్ సీఎస్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను 3Dలో లో నిర్మించనున్నారు. త్వరలో థియేటర్స్ లో విడుదల చేస్తామని ప్రకటించింది నిర్మాణ సంస్థ.

Exit mobile version