యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం. ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. అనంతరం డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో బంగార్రాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మధురం చిత్రం మధురమైన విజయం సాధించి హీరోగా ఉదయ్ రాజ్‌కి, దర్శకుడిగా రాజేష్‌కి, మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె, దర్శకులు విజయ్ కుమార్ కొండా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ నైంటీస్ కథ కావడంతో చాలా కేర్ తీసుకుని రూపొందించారు. మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ అద్భుతమైన సంగీతం అందించారు ”అని చెప్పారు. దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ ‘‘ఈ కథను ఎంత బాగా రాసుకున్నానో.. అంతే చక్కని టీమ్ కుదిరింది. హీరో ఉదయ్, హీరోయిన్ వైష్ణవి చాలా బాగా నటించారు ”అని చెప్పారు.