Site icon NTV Telugu

Madhubala : ముద్దు సన్నివేశంపై మధుబాల ఓపెన్ కామెంట్స్..

Madhu Bala

Madhu Bala

అందం,అభినయం కలగలిసిన అలనాటి కథానాయికలలో మధుబాల ఒకరు. 1992లో ‘రోజా’ చిత్రం తో మొదలైన ఆమె కెరీర్ తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన సినిమాల్లో భాగం అయింది. కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె, టెలివిజన్ హోస్టింగ్, క్యారెక్టర్ రోల్స్ ద్వారా మళ్లీ తెరపైకి రాగా. ప్రజంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది..

Also read : Kanthara1 : కాంతార చాప్టర్ 1 మూవీ టీం‌లో మరొకరు మృతి..

‘మనం ఒక్క లక్ష్యంతో ముందడుగు వేసినప్పుడు ప్రతి ఒక్కటి భరించగలగాలి. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో స్కిన్ షో లేదా ముద్దు సన్నివేశాల్లో నటించడం అసలు నచ్చేది కాదు.. ఆ కారణంతోనే చాలా సినిమాలు వదులుకున్నా. కానీ, ఓ సినిమా కోసం నేను ఆ రూల్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. సెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత కిస్ సీన్ చేయాలని టీమ్ చెప్పింది. నేను అందుకు అంగీకరించలేదు. కాకపోతే, ఆ సీన్ ముఖ్యమని టీమ్ చెప్పడంతో తప్పలేదు. అది నన్నెంతో ఇబ్బంది పెట్టింది. తీరా చూస్తే ఎడిటింగ్ సమయంలో ఆ సన్నివేశం అవసరం లేదని టీమ్ భావించింది. దాంతో సీన్ తీసేశారు. ఆ విషయంలో దర్శకుడితో నేను ఏమీ గొడవ పడలేదు. సినిమా కోసం ఎలాంటి సన్నివేశాలు నైనా నటించాల్సి ఉంటుందని, సీనియర్ నటీమణులను చూసాకే నాకు అర్థమైంది’ అని మధుబాల చెప్పుకొచ్చింది.

Exit mobile version