Site icon NTV Telugu

Rajinikanth: రజనీకాంత్ పాదాలకు నమస్కరించిన మాధవన్.. వీడియో వైరల్‌

Rajinikanth Madhavan

Rajinikanth Madhavan

మనదేశ రహస్యాలను, శత్రు దేశాలకు చేరవేసాడనే ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్. ఈనేపథ్యంలో.. ఈశాస్త్రవేత్త జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకేట్రి ది నంబి ఎఫెక్ట్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో.. సూర్య అతిథి పాత్రలో నటించిన ఈసినిమా హిందీ వెర్షన్‌లో సూర్య చేసిన పాత్రను షారుఖ్ తో చేయించారు. అయితే.. దేశ రాకేట్ ప్రయోగాలకు ఎంతగానో ఉపయోగపడే ఒక శాస్త్రవేత్తను అకారణంగా గూఢచర్యం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిందీ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో.. చిత్ర టీమ్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

అయితే.. ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్‌ చూసి టీమ్‌ను మెచ్చుకున్నారు. నంబి నారాయణన్‌ జీవితాన్ని మరింత వాస్తవంగా తెరకెక్కించి తొలి సినిమాతోనే తానూ గొప్ప దర్శకులతో సమానమని మాధవన్‌ నిరూపించుకున్నారని రజనీకాంత్‌ ప్రశంసించారు కూడా.. రాకెట్రీ స్పెషల్ షోను రిలీజ్ కు ముందే ప్రత్యేకంగా చూసిన రజనీకాంత్ మూవీ టీమ్ పై అప్పుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక రీసెంట్ గా మాధవన్ ను స్పెషల్ గా శాలువాతో సత్కరించారు. అనంత‌రం మాధవన్‌ ర‌జినీకాంత్ పాదాలు తాకి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ చిత్రంలో సిమ్రాన్‌, ర‌జిత్ క‌పూర్‌, మిషా ఘోష‌ల్‌, ర‌వి రాఘ‌వేంద్రతోపాటు స్టార్ హీరోలు షారుక్ ఖాన్‌, సూర్య కీల‌క పాత్రలు పోషించారు.

ఇక మాధవన్‌ దీనికి సంబందించిన ఫోటో వీడియోలను తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, తన అభిమానులతో ఆనంద క్షణాలు పంచుకున్నారు. మీరు వన్ మ్యాన్ ఇండస్ట్రీ , లెజెండ్ ఆశీర్వాదాలు పొందినప్పుడు మ‌రిచిపోలేని క్షణమని, రాకెట్రీ సినిమాపై రజినీకాంత్ సార్ ప్రేరణ మాలో చైతన్యం నింపిందని, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామంటూ మాధ‌వ‌న్ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసాడు. దీంతో ఆ ట్వీట్ కాస్త ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Exit mobile version