Rajinikanth: రజనీకాంత్ పాదాలకు నమస్కరించిన మాధవన్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశ రహస్యాలను, శత్రు దేశాలకు చేరవేసాడనే ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్. ఈనేపథ్యంలో.. ఈశాస్త్రవేత్త జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకేట్రి ది నంబి ఎఫెక్ట్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో.. సూర్య అతిథి పాత్రలో నటించిన ఈసినిమా హిందీ వెర్షన్లో సూర్య చేసిన పాత్రను షారుఖ్ తో చేయించారు. అయితే.. దేశ రాకేట్ ప్రయోగాలకు ఎంతగానో ఉపయోగపడే ఒక శాస్త్రవేత్తను అకారణంగా గూఢచర్యం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిందీ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో.. చిత్ర టీమ్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
అయితే.. ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి టీమ్‌ను మెచ్చుకున్నారు. నంబి నారాయణన్ జీవితాన్ని మరింత వాస్తవంగా తెరకెక్కించి తొలి సినిమాతోనే తానూ గొప్ప దర్శకులతో సమానమని మాధవన్ నిరూపించుకున్నారని రజనీకాంత్ ప్రశంసించారు కూడా.. రాకెట్రీ స్పెషల్ షోను రిలీజ్ కు ముందే ప్రత్యేకంగా చూసిన రజనీకాంత్ మూవీ టీమ్ పై అప్పుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక రీసెంట్ గా మాధవన్ ను స్పెషల్ గా శాలువాతో సత్కరించారు. అనంతరం మాధవన్ రజినీకాంత్ పాదాలు తాకి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ చిత్రంలో సిమ్రాన్, రజిత్ కపూర్, మిషా ఘోషల్, రవి రాఘవేంద్రతోపాటు స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సూర్య కీలక పాత్రలు పోషించారు.
Also Read
ఇక మాధవన్ దీనికి సంబందించిన ఫోటో వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తన అభిమానులతో ఆనంద క్షణాలు పంచుకున్నారు. మీరు వన్ మ్యాన్ ఇండస్ట్రీ , లెజెండ్ ఆశీర్వాదాలు పొందినప్పుడు మరిచిపోలేని క్షణమని, రాకెట్రీ సినిమాపై రజినీకాంత్ సార్ ప్రేరణ మాలో చైతన్యం నింపిందని, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామంటూ మాధవన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీంతో ఆ ట్వీట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
When you get the blessings from a one man industry & the Leagend himself in the presence on @NambiNOfficial -it’s a moment etched for eternity-Thank you for you kindest words on #Rocketry & the affection @rajinikanth sir.This motivation has completely rejuvenated us. We love you pic.twitter.com/ooCyp1AfWd
— Ranganathan Madhavan (@ActorMadhavan) July 31, 2022
తాజావార్తలు
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!