NTV Telugu Site icon

Maruthi Ngar Subramanyam : అల్లు అర్జున్ మూవీ సీన్స్ తో రొమాంటిక్ సాంగ్..మేడమ్ సార్ మేడమ్ అంతే..

Whatsapp Image 2024 04 17 At 12.54.00 Pm

Whatsapp Image 2024 04 17 At 12.54.00 Pm

విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’.కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్నా ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. ‘నేనే సుబ్రహ్మణ్యం’ అనే టైటిల్ సాంగ్ ను ఆవిష్కరించడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. . సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాల పాడిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది..తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ అనే పాటను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు.’మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాలో రావు రమేష్ తనయుడిగా అంకిత్ కొయ్య నటించారు. అంకిత్ కు జోడి గా రమ్య పసుపులేటి నటిస్తుంది.’మేడమ్ సార్ మేడమ్ అంతే’ పాటను ఈ జోడి ఫై తెరకెక్కించారు.

అల్లు అర్జున్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన ఈ సన్నాఫ్ సుబ్రమణ్యం. ప్రేమించిన అమ్మాయి తన ముందుకు వచ్చిన ప్రతిసారీ కూడా తన అభిమాన హీరో సినిమాల్లోని హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాల్లో ఆమెను ఊహించుకుంటాడు.తాజాగా రిలీజ్ చేసిన ‘మేడమ్ సార్ మేడమ్ సార్’ పాటలో అల్లు అర్జున్ సినిమాలలోని సీన్స్ ను రీ క్రియేట్ చేశారు.ఈ మూవీకి కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ అందించారు.’మేడమ్ సార్ మేడమ్ సార్’ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడారు .ప్రస్తుతం ఈ పాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది .ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న”మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం” చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం” అని మేకర్స్ తెలిపారు .

Madam Sir Lyrical Video | Ankith Koyya | Ramya Pasupuleti |Sid Sriram | Bhaskarabhatla |Kalyan Nayak