బ్లాక్‌బస్టర్ మూవీ ‘మ్యాడ్’ అంత చూసే ఉంటారు . ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రాబోతుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న ‘మ్యాడ్’ మూవీలో తమ నటనతో ఆకట్టుకున్న నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఇప్పుడు ఈ ‘మ్యాడ్ స్క్వేర్’ లో కూడా నవ్వులు పూయించడానికి సిద్ధం అయ్యారు. వీరితో పాటు దర్శకుడు కె.వి. అనుదీప్, ప్రియాంక జవాల్కర్ ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక మొదటి భాగం ఊహించని స్థాయిలో రెస్పాండ్ అందుకోవడంతో, ఈ సిక్వేల్‌ని పెద్ద సినిమాగా రిలీజ్ చేస్తున్నారు.
Also Read: ‘SA10’ : షాకిచ్చిన సుశాంత్.. ఆశ్యర్యంలో అక్కినేని ఫ్యాన్స్
ఇక మార్చి 28, 2025న విడుదల కాబోతున్నా ఈమూవీ నుండి ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ విశేషంగా ఆకట్టుకోగా, టీజర్ మాత్రం సోషల్ మీడియాలో మారు మ్రోగిపోయింది. దీంతో ప్రేక్షకుల్లో మూవీ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ‘మ్యాడ్ స్క్వేర్’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మరీ లెంగ్తీగా లేకుండా సింపుల్ అండ్ స్వీట్‌గా ఉండే విధంగా, కేవలం 2 గంటల 7 నిమిషాల రన్ టైం మాత్రమే ఉంచారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు రెండున్నర గంటలు, అంతకు మించి ఉంటున్నాయి. ప్రేక్షకులకు బోర్ కొడుతుండటంతో విడుదల తర్వాత రన్ టైం తగ్గిస్తున్నారు. ఈ విషయంలో మ్యాడ్ స్క్వేర్ మేకర్స్, ముందుగానే మరీ ఎక్కువ రన్ టైం లేకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.