Site icon NTV Telugu

Maa Inti Bangaram: మీరు చూస్తా ఉండండి.. సంక్రాంతికి సమంత సర్‌ప్రైజ్‌!

Samantha Maa Inti Bangaram

Samantha Maa Inti Bangaram

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వెబ్ సిరీస్‌లపై ఎక్కువ ఫోకస్ పెట్టిన సామ్.. నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై ‘శుభం’ సినిమాను నిర్మించడమే కాకుండా.. చిన్న క్యామియోతో ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి సామ్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

Also Read: Iphone 17 Price Drop: యాపిల్ ప్రియులకు శుభవార్త.. అతి చౌకగా ఐఫోన్ 17, ఎయిర్ ఐప్యాడ్, మాక్‌బుక్!

2026 జనవరి 9న మా ఇంటి బంగారం చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నట్లు సమంత సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘మీరు చూస్తా ఉండండి, మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది’ అని రాసుకొచ్చారు. దాంతో సామ్ అభిమానులు సంబరపడుతున్నారు. ‘ఓ బేబీ’ తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రమీ మా ఇంటి బంగారం. గత అక్టోబర్‌ 2న సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది. ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై సామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డైరెక్టర్ రాజ్‌ నిడిమోరు, హిమాంక్‌ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు గుల్షన్‌ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. 1980ల నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో ఈ రానున్నట్లు సమాచారం.

Exit mobile version