NTV Telugu Site icon

MAA : ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం.. డీజీపీకి ‘మా’ ఫిర్యాదు

Maa Manchu Vishnu

Maa Manchu Vishnu

MAA Association Complains to DGP over Trolling: తెలంగాణ డీజీపీకి మా(మూవీ ఆర్టిస్ట్) అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. అసోసియేషన్ తరపున శివబాలాజీ, రాజీవ్ కనకాల, సీనియర్ నటుడు శివకృష్ణలు డీజీపీని కలిశారు. సోషల్ మీడియాలో నటులపై వస్తున్న ట్రోల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. మా అసోసియేషన్, నటీనటులపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ కోరారు. ఐదు యూ ట్యూబ్ ఛానళ్ళను నిషేధించాలని డీజీపీని కలిసిన మా అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేశారు.. ఇప్పటికే 5 యూ ట్యూబ్ ఛానళ్ళ పై చర్యలు తీసుకోవాలంటూ యూట్యూబ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేసిన కాపీని డీజేపీకి అందచేశారు మా అసోసియేషన్ ప్రతినిధులు. ఇప్పటి వరకు 25 యూట్యూబ్ ఛానళ్ళను టెర్మినేట్ చేశామని ఈ సందర్భంగా డీజీపీ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఇక ప్రత్యేకంగా మా దాంట్లో సైబర్ క్రైమ్ టీమ్ పెట్టుకున్నామని కూడా డీజీపీకి వెల్లడించారు. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ తో కలిసి కో ఆర్డినేషన్ కమిటి ఏర్పాటు చేయబోతున్నామని కూడా వెల్లడించారు.

Release clash : ఏమప్పా కన్నప్ప..ఏంటి పుష్పా ఇది..!

ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం అని లేడీ ఆర్టిస్టుల పై వస్తున్న ట్రోల్ చాలా దారుణంగా ఉన్నాయి అని అన్నారు. కుటుంబాలు చాలా బాధ పడుతున్నాయని, క్యారెక్టర్ ను కించ పరిచేలా ట్రోల్ చేస్తున్నారని, పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. వీటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు డీజీపీ ని కలిసి ఫిర్యాదు చేశామని అన్నాడు. ట్రోల్స్ చేసేవి 200పైగా ఛానల్స్ ఉన్నాయి. ఇప్పటికే 25 ఛానల్స్ ఇప్పటికే డౌన్ చేసాము, మీరు కూడా అందులో ఉంటే ఆ లింక్ లు తీసి వెయ్యండన్నారు. ఈ అంశంలో డిజిపి సానుకూలంగా స్పందించారని సైబర్ సెక్యూరిటీ వింగ్లో స్పెషల్ సెల్ దీనిమీద ఫోకస్ పెడుతుందని చెప్పారని వెల్లడించారు. డిపార్ట్మెంట్ అండ్ సినిమా వాళ్ళం సమన్వయం చేసుకుని ఇలాంటి వారి పై చర్యలు తీసుకుంటామని శివ బాలాజీ అన్నారు. ప్రతి దానికి హద్దులు ఉంటాయన్నారు ఆయన.