NTV Telugu Site icon

Kollywood : చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత..

Untitled Design (30)

Untitled Design (30)

తమిళ సినీమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ Axess Film ఫ్యాక్టరీ నిర్మాత G. ఢిల్లీ బాబు ఇటీవల అనారోగ్యం కారణంగా చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సెప్టెంబర్ 9 తెల్లవారుజామున సుమారు 12.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఢిల్లీ బాబు అంత్యక్రియలు సెప్టెంబర్ 9 సోమవారం సాయంత్రం 4.30 గంటలకు జరుగుతాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ బాబు నిర్మాతగా రాట్ సన్ 9 తెలుగులో( రాక్షసుడు) , ఓ మై కడవులే తెలుగులో ( ఓరి దేవుడా ) రీమేక్ అయ్యాయి, అలాగే జీవీ ప్రకాష్ హీరోగా వచ్చిన బ్యాచిలర్, మిరల్, మరకతమణి  వంటి చిత్రాలను నిర్మించారు. ఢిల్లీ బాబు అకాల మరణం యావత్ సినీ వర్గాలను, ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళ నిర్మాత డిల్లీ బాబు భౌతికకాయాన్ని చెన్నైలోని పెరుంగళత్తూరులోని ఆయన స్వగృహానికి ఉదయం 10.30 గంటలకు నివాళులర్పిస్తారని తెలుస్తోంది. దురదృష్టకర వార్త తెలియగానే పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు G. ఢిల్లీ బాబు మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Show comments