Lyricist Chandrabose’s Brother: చంద్రబోస్ సోదరుడు మృతిపై అనుమానాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సినీ లిరిసిస్ట్ చంద్రబోస్ సోదరుడు రాజేందర్ అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే, రాజేందర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 60 ఏళ్ల రాజేందర్ ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా, కలికిరిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, ఆయన ఒంటిపై గాయాలు ఉన్నాయని, మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ భార్య దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కలికిరి పోలీస్ స్టేషన్‌కు ఈ కేసును బదిలీ చేశారు. ఇక తన భర్త రాజేందర్‌తో పాటు శ్రీనివాస్, సుధీర్ అనే ఇద్దరు వ్యక్తులు వెళ్లినట్లు రాజేందర్ భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
చంద్రబోస్ సోదరుడు రాజేందర్, ఆయన భార్య వసంత హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని బౌరంపేట డాలర్ డ్రీమ్స్‌లో నివాసం ఉంటున్నారు. రాజేందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గత నెల 18వ తేదీన బెంగళూరు వెళుతున్నట్లు భార్యకు సమాచారం ఇచ్చి వెళ్లారు. ఇక తాజాగా మీడియాతో చంద్రబోస్ మరో సోదరుడు మాట్లాడుతూ.. బెంగళూరు వెళుతున్నాడని చెప్పిన రాజేందర్ భూమికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి మదనపల్లికి వెళ్లారని వెల్లడించారు. ఈ నెల మూడో తేదీన ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు తమ కుటుంబానికి సమాచారం వచ్చిందని ఈ సందర్భంగా చంద్రబోస్ సోదరుడు చెప్పుకొచ్చారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!