Lyca Productions : ‘జాసన్ సంజయ్’ ఫస్ట్ సినిమా మోషన్ పోస్టర్ విడుదల
- దర్శకుడిగా విజయ్ కొడుకు జాసన్ సంజయ్
- మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- సంగీతం అందిస్తున్న తమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లైకా ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ ఎన్నో గొప్ప సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోలు, దర్శకులతోనే సినిమాలు చేయటం కాకుండా, ఎంతో మంది న్యూ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్‌కు సహకారాన్ని అందిస్తూ ఎంకరేజ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు లైకా సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అనౌన్స్మెంట్ సినీ ఇండస్ట్రీలో, సినీ ప్రేక్షకులు, మీడియాలో ఆసక్తిని రేకెత్తించింది.
Also Read : Pushpa 2 : పుష్ప ఎన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుందంటే..!
Also Read
జాసన్ అరంగేట్రం కోసం తలపతి అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి పలు షార్ట్ ఫిల్మ్స్ కు డైరెక్షన్ చేసి ఫైనల్ గా కోలీవుడ్ లో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు జోసెఫ్ విజయ్. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జికెఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ ‘‘ప్రారంభం నుంచి న్యూ టాలెంట్ ను ప్రోత్సహించడానికి లైకా అందులో భాగంగానే జాసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఆయన తెరకెక్కించబోతున్న కథ, ఆయన నెరేషన్ విన్నప్పుడు డిఫరెంట్‌గా అనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా, పాన్-ఇండియా దృష్టిని ఆకర్షించే ప్రధానమైన పాయింట్ ఉంది. ఈ చిత్రంలో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులకు సుపరిచితుడైన సందీప్ కిషన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సరికొత్త కాంబో ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిస్తుందని మేం భావిస్తున్నాం. మ్యూజిక్ సెన్సేషన్ ‘‘తమన్ సంగీతం అందిస్తున్నారు. 2025 జనవరి నుంచి సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నాం’’ అని తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu : గోవా ప్లస్‌గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్‌లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!