ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగిన వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్) సమ్మిట్, భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వినోద రంగంలో కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో నిర్వహించబడింది. మే 1వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై, భారతీయ చిత్ర పరిశ్రమ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారు. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్, మహవీర్ జైన్ ఫిల్మ్స్‌తో కలిసి 9 కొత్త సినిమా ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు ఒక సంచలన ప్రకటన చేసింది.
Read More:Manchu Vs Allu: అందుకే వెనక్కి తగ్గిన అల్లు కాంపౌండ్?
ప్రధానమంత్రి మోదీ యొక్క దూరదృష్టి మరియు లక్ష్యాలకు అనుగుణంగా, భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా రూపొందించేందుకు ఈ 9 ప్రాజెక్టులను రూపొందిస్తున్నట్లు లైకా సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్టులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు కథలను ప్రపంచ వేదికపై ఆవిష్కరించే లక్ష్యంతో మహవీర్ జైన్ ఫిల్మ్స్‌తో సహకారంతో నిర్మించబడనున్నాయి.
ఈ సందర్భంగా లైకా గ్రూప్ చైర్మన్ డా. అల్లిరాజా సుభాస్కరణ్ మాట్లాడుతూ, “భారతీయ మూలాలతో ప్రపంచ స్థాయి సంస్థగా, లైకా గ్రూప్ భారతీయ సినిమాను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆకర్షణీయ కథలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మహవీర్ జైన్ ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది,” అని పేర్కొన్నారు.
Read More:Venkatesh: అన్నీ సెట్టైనా ఈసారి సంక్రాంతి మిస్?
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, హోం వ్యవహారాల సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్‌తో పాటు లైకా చైర్మన్ డా. సుభాస్కరణ్, మహవీర్ జైన్ వంటి ప్రముఖులు పాల్గొని, భారతీయ సినిమా యొక్క భవిష్యత్తుపై చర్చించారు.
