Site icon NTV Telugu

Tollywood Actress : లక్కీ హీరోయిన్‌ చేతిలో 8 సినిమాలు..అన్ని బడా సినిమాలే

Samyukta

Samyukta

మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్‌ భీమ్లా నాయక్‌తో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటికే మలయాళంలో 15 సినిమాలు చేసినా రాని క్రేజ్‌ ‘భీమ్లానాయక్‌ ‘ తీసుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్‌తో బిజీ కావడమే కాదు ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్‌ అన్న పేరు తెచ్చుకుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వచ్చిన సార్‌ సూపర్ హిట్ కాగా నందమూరి కళ్యాణ్ రామ్ తో చేసిన బింబిసార, సాయి దుర్గ తేజ్ తో చేసిన విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్స్‌ గా నిలి లక్కీ హీరోయిన్‌ అయిపోయింది సంయుక్త.

Also Read : RT 76 : రవితేజ – కిషోర్ తిరుమల టైటిల్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

డెబ్యూ మూవీ భీమ్లానాయక్‌ తర్వాత మరోసారి స్టార్‌ మూవీలో నటించే ఛాన్స్‌ రాలేదు. ఆ లోటును అఖండ2 తీర్చింది. బాలయ్య, సంయుక్త కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు. ఇద్దరూ కలిసి ఓ యాడ్ చేశారు.  సంయుక్తకు తెలుగు సినిమా కలిసొచ్చి ఆతర్వాత తమిళం, కన్నడలో నటించే ఛాన్స్ అందుకుంది. లైగర్‌, డబుల్‌ ఇస్మార్ట్‌ వంటి వరుస ఫ్లాపుల తర్వాత పూరీ విజయ్‌ సేతుపతితో తీస్తున్న సినిమాలో సంయుక్తమీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.టాలీవుడ్‌ పేరు చెప్పి ‘మహారాగ్ని’ మూవీతో బాలీవుడ్‌లోకి వెళ్లింది. సంయుక్త మీనన్‌ ప్రస్తుతం తెలుగులో ‘స్వయంభు’లో నిఖిల్‌తో.. నారీ నారీ నడుమ మురారీలో శ్వరాతో జత కడుతోంది. అఖండ2.. హైందవ.. లేటెస్ట్‌గా పూరీ సినిమాతో ఐదు సినిమాలు చేస్తోంది. మలయాళంలో మోహన్‌లాల్‌ ‘రామ్‌’.. తమిళంలో బెంజ్‌ మూవీలో నటిస్తోంది సంయుక్త. మొత్తంగా చూసుకుంటే తెలుగులో 5 హిందీ 1, తమిళం1, మలయాళంలో ఒకటి ఓవరాల్ గా 8 సినిమాలు చేస్తూ హావా సాగిస్తుంది సంయుక్త.

Exit mobile version