LuckyBaskhar 2: దుల్కర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘లక్కీ భాస్కర్ 2’ పక్కా, కానీ ఓ ట్విస్ట్ ఉంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LuckyBaskhar 2: దుల్కర్ సల్మాన్ హీరోగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. 1992 స్టాక్ మార్కెట్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విభిన్న కథనం, దుల్కర్ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో మొదటి నుంచీ ఉంది. తాజాగా ‘లక్కీ భాస్కర్ 2’పై డైరెక్టర్ వెంకీ అట్లూరి ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేసిన ఆయన.. అయితే అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగ ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘లక్కీ భాస్కర్ 2’ తనకు చాలా పెద్ద బాధ్యత అని పేర్కొన్నారు. ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసిందని, వాటిని అందుకునే స్థాయిలో సీక్వెల్ ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే తొందరపడకుండా, పక్కా ప్లాన్‌తో సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తనకు ముందుగా పూర్తి చేయాల్సిన రెండు ప్రాజెక్టులు ఉన్నాయని, అవి పూర్తైన తర్వాతే ‘లక్కీ భాస్కర్ 2’ పనులు స్టార్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ‘లక్కీ భాస్కర్’ కథ ఎలా పుట్టిందో కూడా వెంకీ అట్లూరి వివరించారు. ‘సార్’ సినిమాలో ఎక్కువగా సందేశాలు ఇచ్చిన తర్వాత, ఎలాంటి మెసేజ్ లేకుండా ఓ పూర్తి స్థాయి కాన్ ఫిల్మ్ చేయాలని అనుకున్నట్లు తెలిపారు. 1992 స్టాక్ మార్కెట్ స్కామ్ ఆధారంగా సినిమా చేయాలనే ఆలోచన వచ్చినప్పటికీ, కేవలం ఓ వ్యక్తి కథగా కాకుండా ఆ వ్యవస్థలో భాగమైన మరికొందరి కోణాన్ని చూపించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
Also Read
- SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
- Kajal Aggarwal: "అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్‌లోకి వచ్చాడు".. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
- Sumanth: 'నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..' అంత మాట అనేశాడేంటి?
- NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
అందులో భాగంగానే ఓ సాధారణ బ్యాంక్ క్యాషియర్‌ను కీ రోల్లో తీసుకుని, అతడిని ఈ స్కామ్ ప్రపంచంలోకి వెళ్లే వ్యక్తిగా చూపించానని వెల్లడించారు. ఈ సినిమా స్క్రిప్ట్ రాయడం తన కెరీర్లోనే అత్యంత కష్టమైన ప్రక్రియ అని, షేర్ మార్కెట్, ట్రేడింగ్ అంశాలపై అవగాహన కోసం నిపుణుల సలహాలు తీసుకున్నట్లు వెల్లడించారు. దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు సాధారణ వ్యక్తి పాత్రలు బాగా సరిపోతాయని, చిన్న మార్పులతోనే పాత్రలోకి పూర్తిగా మారిపోగల నటుడు అని ప్రశంసించారు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి చిత్రాల్లో ఆయన నటన దీనికి మంచి ఉదాహరణ అని అన్నారు. ఫస్ట్ పార్ట్ తెలుగులో మాత్రమే తెరకెక్కించినప్పటికీ తమిళంలోనూ భారీ ఆదరణ లభించిందని వెంకీ అట్లూరి అన్నారు. ‘లక్కీ భాస్కర్’ సక్సెస్ నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయని, అయితే ఈసారి మరింత బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో సమయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తానికి దుల్కర్ మళ్లీ భాస్కర్‌గా కచ్చితంగా వస్తాడని, అయితే దానికి టైం పడుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
LuckyBaskhar 2: దుల్కర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘లక్కీ భాస్కర్ 2’ పక్కా, కానీ ఓ ట్విస్ట్ ఉంది!
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
India New Jersey: భారత జట్టుకు కొత్త లుక్.. బ్లూ జెర్సీకి గుడ్‌బై.. కాషాయపు జెర్సీతో వరల్డ్‌కప్ బరిలోకి.!
-
Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
-
Mumbai: ముంబైలో ఫేమస్ వడాపావ్‌పై నిషేధం.. కారణమిదే!
ట్రెండింగ్
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!