Love You Raa : సెప్టెంబర్ 5న హారర్ కామెడీ ‘లవ్ యూ రా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద చిన్ను హీరోగా, గీతికా రతన్ హీరోయిన్గా సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలుగా రానున్న చిత్రం ‘లవ్ యూ రా’. ఈ మూవీకి ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ను సోమవారం (ఆగస్ట్ 18) నాడు నిర్వహించారు. ఈ క్రమంలో ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ అనే పాటలను లాంచ్ చేశారు.
ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్లో హీరో చిన్ను మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ నాకు మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ ప్రయాణంలో మా వెన్నంటే నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చారు. ‘లవ్ యూ రా’ ఆద్యంతం అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. గీతిక పాత్రకు ప్రాణం పోశారు. కృష్ణ సాయి కారెక్టర్ అందరినీ నవ్విస్తుంది. చంద్ర శేఖర్ గారి పాత్ర చాలా బాగా వచ్చింది. మా చిత్రంలో హారర్, కామెడీ, లవ్ ఇలా అన్ని అంశాలుంటాయి. ఈశ్వర్ గారు మాకు మంచి పాటలు ఇచ్చారు. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. మీడియా సపోర్ట్ ఉంటేనే మాలాంటి వాళ్లు ఆడియెన్స్ వరకు చేరుకుంటాం. మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Also Read
- OG Satellite Rights: ఓజీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న టాప్ ఛానల్!
- Boman Irani: పెద్ది ట్రైలర్‌లోని ఆ సీన్ వెనుక ఎంత కథ ఉందో తెలుసా? ఆ ఒక్క డైలాగ్ కోసం 78 టేక్స్ తీసుకున్నాడట!
- Sai Rajesh: 'వ్యూస్ కొంటున్నాం.. డబ్బులిచ్చి కామెంట్స్ రాయిస్తున్నాం' 'బేబీ' డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
- Megastar Chiranjeevi: రెండు రోజుల్లో రెండోసారి.. ఎగ్జిబిటర్లతో చిరంజీవి మీటింగ్! 'పెద్ది' విషయంలో కీలక నిర్ణయం..
- Tags
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
-
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్‌పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్‌లో ఉన్నది అదే అంటూ..
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!