Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి హీరో హీరోయిన్ లుక్స్ ఇవ్వడంలో సంజయ్ లీలా భన్సాలీ లేట్ చేస్తున్నాడేమో కానీ లీక్ వీరులు మాత్రం చాలా ఫాస్ట్‌గానే ఉన్నారు. ఇప్పటికే రణబీర్, ఆలియా, విక్కీ కౌశల్ పిక్స్ బయటకు వచ్చి.. నెట్టింట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. విక్కీ అండ్ రణబీర్ ఎయిర్ ఫోర్స్ డ్రెస్సుల్లో ఉన్న పిక్స్, ఆలియా రెట్రో స్టైల్ లుక్స్ లీకయ్యాయి. ఈ లీక్స్ ఎక్కువ కావడంతో దర్శకుడే హీరోల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశాడు.
తాజాగా ఆలియా భట్ లుక్ రివీల్ చేశాడు సంజయ్ లీలా భన్సాలీ. పోస్టర్స్‌లో క్యాబరే డ్యాన్సర్ గా రెట్రో లుక్‌లో.. రెడ్ కలర్ సీక్విన్ ఔట్ ఫిట్‌లో మెస్మరైజ్ చేసింది ఆలియా. లవ్ అండ్ వార్ నుండి ఇలా ఫస్ట్ లుక్ వచ్చిందో లేదో కొన్ని గంటల్లోనే సాంగ్ మేకింగ్ వీడియో లీకైంది. ఇక ఆలియా డ్యాన్స్ మూమెంట్స్‌పై నెగిటివ్ కామెంట్స్ స్టార్టయ్యాయి. ఆలియా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. కియారా టాక్సిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ని సంజయ్ లీలా భన్సాలీ కాపీ కొట్టాడంటున్నారు నెటిజన్స్. గంగూభాయ్ కతియా వాడీ తర్వాత ఆలియా అండ్ సంజయ్ లీలా భన్సాలీ కాంబోలో తెరకెక్కుతోన్న ఫిల్మ్ లవ్ అండ్ వార్. నెక్ట్స్ ఇయర్ జనవరి 21న రిలీజ్ కానుంది. గంగూ భాయ్ కతియా వాడీ ఇచ్చిన హిట్ తో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాల వైపు టర్న్ తీసుకుంది ఆలియా. కానీ జిగ్రా, ఆల్ఫా బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. దీంతో యూటర్న్ తీసుకుని గ్లామర్ గర్ల్‌గా మారింది. సంజయ్ లీలా భన్సాలీ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.. కానీ కొన్ని సార్లు మిస్ ఫైర్ కూడా అయ్యాయి. మరి లవ్ అండ్ వార్.. రణబీర్, విక్కీ కౌశల్, ఆలియాకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!