ఎట్టకేలకు విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. 48 ఇయర్స్ సింగిల్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి నటి సాయి ధన్సికతో మింగిల్ కాబోతున్నాడు. ఆగస్టులో పెళ్లి చేసుకుంటానంటూ మేలో ఎనౌన్స్ చేసిన విశాల్ బర్త్ డే రోజున ప్రియురాలి చేతికి ఉంగరం తొడిగి ఫోటోలు షేర్ చేసుకున్నాడు. కానీ మ్యారేజ్ త్వరలో అంటూ కన్ఫర్మ్ డేట్ చెప్పకుండా స్కిప్ చేశాడు. ఆగస్టు 29నే పెళ్లి చేసుకుంటామని చెప్పినప్పటికీ ముందు ఇచ్చిన కమిట్మెంట్ వల్ల జస్ట్ ఎంగేజ్ మెంట్‌తో సరిపెట్టేశాడు పందెంకోడీ హీరో.
Also Read : Re-shoot : ప్యాచ్ వర్క్ కోసం 15 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న స్టార్ హీరో
గతంలో తనతో నటించిన కొంత మంది హీరోయిన్లతో విశాల్ డేటింగ్ చేశాడంటూ వార్తలొచ్చాయి. వారిలో తన సినిమాలో నటించిన రీమాసేన్ తో అప్పట్లో నిజంగానే ప్రేమ చదరంగం ఆడాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇంద్రుడు సినిమాలో జత కట్టిన లక్ష్మీమీనన్ తో ప్రేమ పాఠాలు చెప్పాడని గుసగుసలు వినిపించాయి. ఇక తమిళ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ తో వ్యవహారం అప్పట్లో కోలీవుడ్ లో సంచలనం. రీసెంట్లీ అభినయతో పీకల్లోతు ప్రేమలో మునిగాడంటూ గాసిప్స్ గట్టిగానే వినిపించాయి. కానీ అభినయ తన చిరకాల ప్రేమికుడితో పెళ్లి పీటలు ఎక్కుతోంది. ఇక ప్రేమ పాఠాలు చెప్పడం ఆపేసి చివరకు మరో హీరోయిన్ సాయి ధన్సిక చేతికి ఉంగరం తొడిగాడు చెన్నై చిన్నోడు విశాల్. కొసమెరుపు ఏంటంటే గతంలో అర్జున్ రెడ్డి ఫేం అనీషాతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విశాల్ ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఇప్పుడు సాయి ధన్సికను త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నాడు.
