Site icon NTV Telugu

Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్ హీరోగా మూవీ

Lokesh Kanagaraj

Lokesh Kanagaraj

లోకేశ్ కనగరాజ్ రెండేళ్ల పడ్డ టెన్షన్‌కు ఆగస్టు 14కి తెరపడింది. కూలీ రిజల్ట్ వచ్చేయడంతో రిలాక్స్ అవుతున్నాడు లోకీ. ఈ ప్రాజెక్ట్ వల్ల కాస్త నెర్వస్ ఫీలైన లోకీ సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇవ్వగా, రీసెంట్‌గా మూవీ అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌తో టచ్‌లోకి వచ్చేశాడు. ఇక నెక్ట్స్ కార్తీతో *ఖైదీ 2*ని ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్, మెగాఫోన్‌కు కాస్త గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పటి వరకు తెర వెనుక కనబడిన తాను, ఇకపై తెర ముందుకు రావాలని డిసైడ్ అయ్యాడు.

Also Read:Kishkindhapuri : కిష్కిందపురి టీజర్ రిలీజ్.. భయపెట్టేస్తున్న బెల్లంకొండ..

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు లోకేశ్ కనగరాజ్. ఇప్పటికే దర్శకుడ్ని కూడా సెట్ చేశాడు. తనను హీరోగా నిలబెట్టే బాధ్యతను *కెప్టెన్ మిల్లర్* ఫేం అరుణ్ మాథేశ్వరన్ భుజాన వేసుకున్నాడు. ధనుష్‌తో ఇళయరాజా బయోపిక్ తీయాల్సి ఉండగా, *కుబేర* హీరో వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండి, అరుణ్‌కు హ్యాండ్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుండటంతో, లోకీ ఇచ్చిన ఆఫర్‌ను పరమాన్నంలా స్వీకరించి అటు షిఫ్ట్ అయ్యాడు అరుణ్.

Also Read:Minister Anagani: స్త్రీ శక్తి స్కీమ్ కారణంగా కొత్త పాస్ బుక్స్ రిలీజ్ వాయిదా పడింది..

హీరో కావాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న లోకీ, ఓ ట్రయల్ వెయ్యాలని భావిస్తున్నాడు. గతంలో ఓ స్పెషల్ సాంగ్‌లో శృతితో కలిసి యాక్ట్ చేశాడు లోకీ. పర్ఫార్మెన్స్ ఓకే అనిపించుకోవడంతో, హీరోగా కంటిన్యూ కావాలని అనుకుంటున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును అనుకున్న టైంలోనే కంప్లీట్ చేయాలని అరుణ్‌కు లోకీ కండిషన్ పెట్టాడని టాక్. ఇది కంప్లీట్ కాగానే *ఖైదీ 2*కి షిఫ్ట్ అయ్యిపోనున్నాడు డైరెక్టర్. త్వరలో దర్శకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తానంటోన్న లోకీని హీరోగా కోలీవుడ్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్నది త్వరలో తేలిపోనుంది.

Exit mobile version