LGBT Legal Battle: పార్ట్-2కు ప్రభుత్వ సహకారం ఉంటుందన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక అంశాన్ని అత్యంత హృద్యంగా ఆవిష్కరించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ‘ఎల్జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్’ చిత్రం విజయవంతంగా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఘనంగా విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. సమాజంలో ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా గౌరవప్రదమైన జీవితం ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వారికి ప్రాధాన్యం కల్పిస్తున్నామని, అందరితో సమానంగా వారు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తున్న ఈ చిత్రానికి కొనసాగింపుగా రాబోయే ‘ఎల్జీబీటీ పార్ట్-2’ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన ప్రకటించారు. దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించి 50 రోజుల విజయాన్ని అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి మనిషిని గౌరవించే భావన సమాజంలో పెరగాలనే ఈ సినిమాను తీశామని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!