Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ, తెలుగు సినీ పరిశ్రమను తనదైన సంగీతంతో ఉర్రూతలూగించిన ప్రముఖ లెజెండరీ సంగీత దర్శకుడు ‘తేనిసై తెండ్రల్’ దేవా కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో కోలీవుడ్‌తో పాటు యావత్ దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దక్షిణాది ప్రేక్షకులకు ముఖ్యంగా తమిళ సినీ అభిమానులకు దేవా పేరు ఒక ఎమోషన్. 90వ దశకంలో సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీని తన మాస్ బీట్స్ తో, వినసొంపైన మెలోడీలతో శాసించిన ఘనత ఆయనదే. మరీ ముఖ్యంగా తమిళ సినీ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ‘గానా’ పాటలను సిల్వర్ స్క్రీన్‌పై పరిచయం చేసి, దాన్ని ఒక ట్రెండ్‌గా మార్చిన అసలైన సృష్టికర్త దేవా. ఆయన స్వరం నుంచి జాలువారిన గానా పాటలకు థియేటర్లలో ప్రేక్షకులు పూనకాలు వచ్చినట్లు ఊగిపోయేవారు. తనదైన మార్క్ వాయిస్, మ్యూజిక్‌తో తనకంటూ ఒక ప్రత్యేకమైన, సువిశాలమైన ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నారు.
1989లో ‘మనసుకేత మహారాస’ అనే చిత్రంతో సంగీత దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌ను మలుపుతిప్పిన ‘అరుణాచలం’, ‘భాషా’ వంటి ఎపిక్ బ్లాక్‌బస్టర్స్‌కు దేవా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఆ రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమల్ హాసన్ నటించిన ‘అవ్వై షణ్ముగి’ (తెలుగులో భామనే సత్యభామనే), అజిత్ ‘కాదల్ కొట్టై’ (తెలుగులో ప్రేమ లేఖ) లాంటి ఎన్నో ఆల్ టైమ్ మ్యూజికల్ హిట్స్ ఆయన ఖాతాలోనే ఉన్నాయి. రజనీ, కమల్, విజయ్, అజిత్ లాంటి అగ్ర హీరోల బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లలో ఆయన సంగీతానిది కీలక పాత్ర. సుదీర్ఘమైన తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం ఇలా నాలుగు భాషల్లో దాదాపు 400కి పైగా సినిమాలకు ఆయన సంగీతం అందించారు. భాషతో సంబంధం లేకుండా తన ట్యూన్స్‌తో మ్యాజిక్ చేశారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ దేవా ఆకస్మిక మరణం పట్ల ఇండస్ట్రీ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. దేవా మృతి వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అశేష అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.
Also Read
- Aakasam Lo Oka Tara Teaser: ఇంటి పని, వంట పనులు నేర్పకుండా బళ్ళు బలాదూర్‌లని తిరగనిస్తే ఇలానే తయారవుతారు
- Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
- Kavya Maran - Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
- Rashmika Mandanna: 'రణబాలి' అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
తాజావార్తలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
-
Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
-
Aakasam Lo Oka Tara Teaser: ఇంటి పని, వంట పనులు నేర్పకుండా బళ్ళు బలాదూర్‌లని తిరగనిస్తే ఇలానే తయారవుతారు
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
ట్రెండింగ్
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!