Legally Veer : ఈ నెల 27న రిలీజ్ కానున్న ‘లీగల్లీ వీర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ టాపిక్ గా మారుతూ అరుదైన లీగల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫ్రీరిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో వీర్ రెడ్డి మాట్లాడుతూ.. “నాకు ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. కరోనా టైమ్‌లో పాడ్ కాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలో సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఓ మంచి సినిమా చేద్దాం అనుకుని, లీగల్ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్ర చేయడం సులభంగా అనిపించింది. ఇంత వరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు.” అని అన్నారు.రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నామని చెప్పారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. డిసెంబర్ 27 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.ఇక దర్శకుడు రవి మాట్లాడుతూ.. “వీర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపించింది. అరుదైన సబ్జెక్టు. మా సినిమాను మీడియాతో పాటు ప్రేక్షకులు ఆదరించాలి.” అని కోరారు.
Also Read
తాజావార్తలు
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
NEET Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్.. అసలు నిజం ఇదే..
-
Railway Rules: టికెట్ లేని ప్రయాణంపై రైల్వే రూల్స్ చేంజ్.. ఇకపై డబుల్ పెనాల్టీ..
-
Maharashtra Temple Tragedy: పర్భణిలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఆరుగురు మృతి
-
PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..