Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!

Sathi Leelavathi Ott

Sathi Leelavathi Ott

రీసెంట్‌గా విడుదలైన టాలీవుడ్ చిత్రాల్లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సతీ లీలావతి’ కూడా ఒకటి. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ‘భీమిలి కబడ్డీ జట్టు’ ఫేమ్ దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కించారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే సమ్మర్ సీజన్‌లో థియేటర్ల వద్ద కొనసాగుతున్న డ్రై పీరియడ్ కారణంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్పందనను అందుకోలేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ రొమ్‌కామ్ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

థియేటర్లలో విడుదలైన కేవలం రెండు వారాల్లోనే ‘సతీ లీలావతి’ డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకోగా, ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంటి వద్దే ఈ సినిమాను వీక్షించవచ్చు.ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా, నాగ మోహన్ బాబు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.