Site icon NTV Telugu

Lavanya Thripati: ముందు దేశంలోపల శుభ్రం చేయాల్సిన సమయం వచ్చింది

Lavanya

Lavanya

పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో ఇప్పటికే భారతదేశం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. కొన్ని చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా పాకిస్తాన్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా పాకిస్తాన్ జాతీయ జెండాను పోస్టర్లుగా ముద్రించి రోడ్డుపై అతికిస్తూ, భారతీయుల కాళ్ల కింద నలిగేలా చేస్తున్నారు. అయితే, ఇది నచ్చని కొంతమంది ముస్లింలు పలు ప్రాంతాల్లో వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలు వైరల్ అవుతూ వచ్చాయి.

Read More: NTR Neel: ఏంటీ తాటాకు చప్పుళ్లు?

తాజాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ప్రాంతంలో అలా అతికించిన పోస్టర్‌ను ఒక హిందూ యువతి తొలగించే ప్రయత్నం చేయగా, అక్కడి స్థానికులు అందరూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని రీపోస్ట్ చేసిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More: India – Pakistan యుద్ధ చరిత్ర.. తప్పక తెలుసుకోవాల్సిందే !!

“మన సైనికులు తమ జీవితాలను పణంగా పెట్టి మన దేశాన్ని రక్షిస్తున్నారు. వారి జీవితాలను ఇబ్బంది పెట్టే వారిని సమర్థిస్తున్న వారిని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ముందు దేశంలోపల శుభ్రం చేయాల్సిన సమయం వచ్చింది,” అంటూ లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు.
ఆమె చేసిన వీడియోకు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. “ప్రాణానికి ప్రాణం కావాలి, ఎటాక్‌కు ఎటాక్ కావాలి. అంతేకానీ ఇలా చేయడం ఏంటో అర్థం కావడం లేదు,” అంటూ ఒకరు కామెంట్ చేశారు. చివరికి ఒక సెలబ్రిటీ ఈ విషయంలో మాట్లాడింది. “ఇక్కడ నిజం మాట్లాడితే ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నాం. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్,” అంటూ ఒక నెటిజన్ ఆమెకు సలాం చేస్తూ కామెంట్ చేశారు.

Exit mobile version