Site icon NTV Telugu

“థాంక్యూ” సెట్స్ లో చైతన్య… పిక్ వైరల్

Latest Click of Naga Chaitanya from the sets of Thank You Movie

అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే చిత్రబృందం ఎంతో సాహసం చేసి ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ చిత్రంలో చైతన్య రెండు డిఫెరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే చైతన్య, రాశిఖన్నా తీసుకున్న సెల్ఫీలో చైతన్య లుక్ విడుదల కాగా… తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన మరో లుక్ వైరల్ గా మారింది. ‘థాంక్యూ’ సెట్లో నాగచైతన్య గడ్డంతో ఉన్న పిక్ ఒకటి నెట్టింట్లో హల్చల్ సి చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన “లవర్స్” చిత్రం రిలీజ్ కరోనా కారణంగా వాయిదా పడింది.

Exit mobile version