NTV Telugu Site icon

Laila : లైలా ట్విట్టర్ రివ్యూ..

Laila

Laila

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందొ తెలుసుకుందాం రండి.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ టైటిల్ కార్డ్ ను ఈ సారి సరికొత్తగా విశ్వక్ ఫ్యాన్స్ మెప్పించేలా డిజైన్ చేసారు. ఇక సినిమాలోకి వెళితే కథ పరంగా చెప్పుకోవడానికి ఏమి లేదు, పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీతో వచ్చాడు దర్శకుడు. అయితే హీరో విశ్వక్ సేన్ తన అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసాడు. హాస్య సన్నివేశాలలో విశ్వక్ మెప్పించాడు. ప్రథమార్ధంలో మెగాస్టార్ సినిమాలైనా ఖైదీ, జగదేకవీరుడు అతిలోక సుందరి తో పాటు అనేక సినిమాల రిఫరెన్స్ లు వాడేశారు. ఇక సెకండ్ హాఫ్ లో చెప్పుకోవడానికి ఏమి లేదని, ఫోర్స్డ్ కామెడి, రొటీన్ గా సాగే సీన్స్, ప్రెడిక్ట్ బుల్ స్క్రీన్ ప్లే, పాటలు నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రమేనట. లేడీ గెటప్ లో మాత్రం విశ్వక్ సేన్ అద్భుతంగా నటించాడని, కానీ విశ్వక్ టాలెంట్ ని రొటీన్ స్టోరీ తో దర్శకుడు నీరుకార్చేసాడని ఓవర్సీస్ ఆడియెన్స్ అభిప్రాయపడుతునున్నారు. ఓవరాల్ గా రెండు విభిన్న పాత్రలు చేసిన ఈ సినిమాకు ఆ రెండు పాయింట్లే ఇవ్వొచ్చని సినిమా చుసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.