Site icon NTV Telugu

NC 24: నాగచైతన్య సినిమాలో విలన్‌గా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా హీరో?

Sparsh

Sparsh

‘తండేల్’ సినిమా సక్సెస్ తర్వాత యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి ఒక మైథలాజికల్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సుకుమార్ బి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాపినీడు సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘లాపతా లేడీస్’ సినిమా హీరో స్పర్ష్ శ్రీవాస్తవను తీసుకున్నారు . కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్పర్ష్ శ్రీవాస్తవ, ఇప్పుడు తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందని చిత్ర బృందం శ్రీవాస్తవకు బెస్ట్ విషెస్ తెలిపింది. ఈ సినిమాలో స్పర్శ్ విలన్ పాత్రలో నాగచైతన్యతో ఢీ కొట్టే పాత్రలో కనిపించబోతున్నాడు.

Also Read : Shilpa Shirodkar: మహేష్ బామ్మర్ది సినిమాతో మరదలి రీ ఎంట్రీ

ఇప్పటికే విడుదలైన “NC24 – The Excavation Begins” ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ గ్లింప్స్‌లో సినిమా స్కేలు, ఇంటెన్స్ మూడ్ అభిమానులను, సినీ ప్రియులను ఆకట్టుకుంది. #NC24 మిస్టరీ, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్‌తో ఒక ప్రత్యేకమైన మైథికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. కార్తీక్ దండు ప్రత్యేకమైన కథాకథనం, SVCC – సుకుమార్ రైటింగ్స్ బలంగా మద్దతు ఇవ్వడం, నాగ చైతన్య కొత్త కోణంలో నటించడం, ఇప్పుడు స్పర్ష్ శ్రీవాస్తవ వంటి నటులు చేరడంతో, ఈ సినిమాపై అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పౌరాణిక థ్రిల్లర్‌లకు కొత్త హద్దులను చూపించేలా ఒక ప్రపంచ స్థాయి సినిమా ఇవ్వడానికి చిత్ర బృందం రాజీ పడకుండా పనిచేస్తోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెల హైదరాబాద్‌లో వేసిన ఒక భారీ సెట్‌లో ప్రారంభం కానుంది. సినిమా విశేషాలకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.

Exit mobile version